మార్ఫింగ్‌తో మాయ..సోషల్ మీడియాలో విషం
మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తున్న మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఉద్యోగులు ముగ్గురిని అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు.
- మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ముసుగులో కార్యకలాపాలు
- పీఎం, సీఎంతోపాటు మహిళలపై అసభ్యకర పోస్టులు
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైబర్‌క్రైం పోలీసులు
- పరారీలో ప్రధాన నిందితుడు: సీసీఎస్ జాయింట్ సీపీ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తున్న మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఉద్యోగులు ముగ్గురిని అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. సోషల్ మీడియాలో వివిధ పేర్లతో ఖాతాలు సృష్టించిన ఈ ముఠా కొంతకాలంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో అసభ్యకర పోస్టులు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైం ఠాణాతోపాటు మార్కెట్, చాంద్రాయణగుట్ట, రాంగోపాల్‌పేట్, అంబర్పేట్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మాదాపూర్‌లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ సంస్థ కార్యాలయంలోని ఐపీ అడ్రసుల నుంచే ఈ పోస్టులు వస్తున్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు.. మంగళవారం సాయంత్రం ఆ కార్యాలయానికి వెళ్లి, అక్కడ పనిచేస్తున్న మంద శ్రీప్రతాప్, శశాంక్, ఇషాన్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. పట్టుబడిన ముగ్గురు సునీల్ కనగోలు అనే వ్యక్తి నేతృత్వంలోనే పనిచేస్తున్నారని, అతనిపైనా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
ఎవరూ కనిపెట్టలేరని..
‘తెలంగాణ గళం’, ‘భారత యువత’ పేరుతో సోషల్ మీడియాలో సునీల్ కనగోలు ఆధ్వర్యంలోని టీం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నదని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ తదితరుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన విధంగా మీమ్స్, వీడియోలు తయారు చేస్తున్నారని వివరించారు.
కాంగ్రెస్ రిట్‌పై నేడు విచారణ
కాంగ్రెస్ పార్టీ వార్ రూం నుంచి చట్టవ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టింగ్ పెడుతున్నారని పోలీసు కేసు నమోదు నేపథ్యంలో ఆ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ ఆధ్యర్యంలో మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో వార్ రూం పేరిట నిర్వహించే కార్యాలయానికి పోలీసులు 13వ తేదీ రాత్రి 10.45 గంటలకు వచ్చి ముగ్గురిని తీసుకువెళ్లారని చెప్పారు. సిమ్లాకు చెందిన ఇషాన్ శర్మ, విశాఖకు చెందిన తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన మండ ప్రతాప్‌లను కోర్టులో హాజరుపర్చేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరుపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. గురువారం విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

