ఉద్యోగుల సీనియారిటీని పాటించాలి: టీజీవోఏ

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఏర్పడిన మల్టీజోన్, జోన్, జిల్లా స్థాయి పోస్టుల నియామకాల్లో సీనియారిటీని పాటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవోఏ) ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. శుక్రవారం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన టీజీవోఏ సమావేశంలో కొత్త జోనల్ వ్యవస్థపై విస్తృతంగా చర్చించారు. వేతన సవరణ అనంతరం తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులుగా చరిత్ర సృష్టించారని పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నేతలు జీ వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణయాదవ్, రవీందర్‌కుమార్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచాలి: పీఆర్టీయూ
నూతన జోనల్ వ్యవస్థలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్‌గా గుర్తించినందునవారిని జిల్లాలవారీగా విభజించి వెంటనే పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చాలా స్కూళ్లలో స్వీపర్లు లేనందున రెగ్యులర్ పద్ధతిలో స్వీపర్లు, స్కావెంజర్లను నియమించాలని, రేషనలైజేషన్ పూర్తిచేసిబదిలీలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో శాసనమండలి మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, మారెడ్డి అంజిరెడ్డి, వివిధ జిల్లాలకు చెంది న కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Employee seniority
- TGOA
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

