ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 30: ఓయూ వేదికగా ‘చదువు, పోరాటం, సామాజిక న్యాయం’ ఎజెండాగా తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (టీఎస్ఏ) పురుడు పోసుకుంది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన అసోసియేషన్ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, యు వజన సమాఖ్య అధ్యక్షుడు పిల్లుట్ల శ్రీనివాస్ హాజరయ్యారు. టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ మాట్లాడు తూ విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని తెలిపారు.