Maharashtra | మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా కమలాపూర్ సమీపంలోని ఏనుగుల క్యాంప్‌లోని రూప అనే ఏనుగు తన దాహం తీర్చుకునేందుకు గురువారం స్థానికంగా ఉన్న చేతిపంపును ఆశ్రయించింది. తొండంతో చేతి పంపు హ్యాండిల్‌ను కొడుతూ.. నీరు తాగింది. వేసవిలో అడవిలో చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఈ ఏనుగు ఇలా చేస్తుందని క్యాంప్ నిర్వాహకులు చెబుతున్నారు. దీన్ని క్యాంప్ నిర్వాహకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.