Uttar Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రోజులో ఏదో ఒక సమయంలో విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 94 శాతం మంది పేర్కొన్నారు. నోయిడానూ కరెంటు కష్టాలు వేధిస్తున్నాయి. జూన్ మాసంలోనూ విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 86 శాతం మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడైంది. యూపీలోని 56 జిల్లాల్లోని 14,000 మందిని కరెంటు కోతల గురించి ‘లోకల్ సర్కిల్స్’ బృందం ప్రశ్నించింది. ప్రతి పది మందిలో తొమ్మిది మంది కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రోజులో నాలుగుసార్లు కరెంటు కోతలు ఉంటున్నట్టు 65 శాతం మంది పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇలా..
విద్యుత్తు కోతలతో దేశంలోని కనీసం 85 శాతం ఇండ్లు ప్రభావితం అవుతున్నాయి. రోజులో 2-8 గంటలపాటు విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 37 శాతం మంది వెల్లడించారు. ఈ మేరకు లోకల్ సర్కిల్స్ చేసిన మరో సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లోని 25 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.
దేశవ్యాప్తంగా కరెంట్ కోతలు
రోజులో ఎన్నిసార్లు కరెంటు పోతుందంటే..
1-2 సార్లు 63 శాతం
3-5 సార్లు 22 శాతం
గమనించలేదు 9 శాతం
తెలియదు 6 శాతం
రోజులో ఎన్ని గంటలు కరెంటు పోతుందంటే..
2 గంటలలోపు 57 శాతం
2-4 గంటలు 31 శాతం
4-8 గంటలు 6 శాతం
చెప్పలేం 6 శాతం