Singareni | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): భూగర్భం నుంచి సహజసిద్ధంగా లభించే వేడినీటి ఆవిరితో వి ద్యుత్తు ఉత్పత్తిపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఓఎన్జీసీ భాగస్వామ్యంతో భారీ జియో థర్మల్ ప్లాంట్లను నిర్మించాలని యోచిస్తున్నది. ప్రాథమికంగా 200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నది.
ఇప్పటికే మణుగూరు సమీపంలోని పగిడేరు వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జియో థర్మల్ విద్యుత్తు కేంద్రం విజయవంతమైంది. సింగరేణి సంస్థ తన సొంత అవసరాల కోసం పడిగేరు వద్ద 4 బోర్లు వేసింది. వీటి నుంచి మోటర్లు లేకుండానే భారీ గా వేడి జలాలు ఉబికివచ్చాయి.
65 నుంచి 80 డిగ్రీల వేడి తో ఉన్న ఈ జ లాలు భూమి నుంచి బయటకు రాగానే ఆవిరవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేయించారు. ఈ నీరు కనీసం 20 ఏండ్లపాటు లభ్యమవుతుందని నిపుణులు అంచనా వేశారు. ఈ నేపథ్యం లో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.