ఘట్కేసర్ రూరల్, జూలై 4: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో సోమవారం ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకొంటూ స్థానిక ఏఈ రాజనర్సింగ్‌రావు, సబ్ ఇంజినీర్ అశోక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం…. ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లో రెం డు విద్యుత్తు స్తంభాల నిర్మాణంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్ నవీన్‌కు చెల్లించడానికి లంచం డిమాండ్ చేశారు. ఏఈ రాజ నర్సింగ్‌రావు రూ.25 వేలు, సబ్ ఇంజినీర్ అశోక్ రూ. 5 వేలు ఇవ్వాలని కరాఖండిగా చెప్పా రు. అతను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఏఈ రూ.19 వేలు, అశోక్ కు రూ.3 వేలు లంచం తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.