హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): 2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు వారోత్సవాలను నిర్వహించ నున్నామని తెలిపారు. శుక్రవారం ప్రజాభవన్లో విద్యుత్తు పొదుపు క్యాలెండర్ను భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్కోడ్ను అమలుచేస్తున్నామని, 879 భవనాలకు కోడ్ అమలు చేయడంతో 392.2 1 మిలియన్ యూని ట్ల విద్యుత్తు ఆదా అయ్యిందని చెప్పారు. పాత విద్యుత్తు పరికరాల స్థానంలో ఎల్ఈడీ తీసుకురావడంతో 2.87 మిలియన్ యూనిట్లు ఆదా అయ్యిందని వెల్లడించారు. తెలంగాణ గతంలో మూడు సార్లు జాతీయ పొదుపు అవార్డులను అందుకున్నదని గుర్తుచేశారు.