57 రాజ్యసభ సీట్లకు జూన్ 10న ఎన్నికలు
- తెలంగాణ నుంచి రెండు స్థానాలు భర్తీ
- ఉత్తరప్రదేశ్లో 11 సీట్లు.. ఏపీలో 4
- 15 రాష్ర్టాల నుంచి సభ్యుల ఎన్నిక
- 24 నుంచి నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్ల పదవీకాలం వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానాల భర్తీకి జూన్ 10 ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. అలాగే యూపీలో 11, ఏపీలో 4స్థానాలు సహా మొత్తం 15 రాష్ర్టాల్లో 57 రాజ్యసభ ఎంపీ సీట్లకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ గురువారం షెడ్యూలు విడుదల చేసింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్ల పదవీకాలం జూన్ 21తో ముగియనున్నది. అలాగే జూన్-ఆగస్టు నెలల్లో ఇతర రాష్ర్టాల్లో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి.
ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులు ప్రభు సురేష్ ప్రభాకర్, టీజీ వెంకటేశ్, వైఎస్ చౌదరి, విజయసాయిరెడ్డిల పదవీ కాలం కూడా జూన్ 21తో ముగుస్తున్నది. కాగా, ఇప్పటికే తెలంగాణలో బండా ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీకి కూడా ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రం నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాల ఖాళీలు భర్తీకానున్నాయి. జూన్ 10 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత ఓట్లు లెక్కిస్తారు. రాజ్యసభ ఎంపీలుగా పదవీ విరమణ చేస్తున్నవారిలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, అంబికా సోని, జైరాం రమేశ్, కపిల్ సిబల్ ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్……..
- నామినేషన్ల స్వీకరణ మే 24
- ఆఖరి తేదీ మే 31
- నామినేషన్ల పరిశీలన జూన్ 1
- ఉపసంహరణ జూన్ 3
- పోలింగ్ జూన్ 10
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

