
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పవర్ ఇంజినీర్స్అసోసియేషన్(టీఎస్‌పీఈఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 2022-23 సంవత్సరానికి ఈ నెల 23న నిర్వహించిన ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించారు. టీఎస్‌పీఈఏ సెంట్రల్ బాడీతోపాటు టీఎస్జెన్కో, టీఎస్‌ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ కార్యవర్గాలను కూడా ఎన్నుకొన్నారు. సెంట్ర ల్ బాడీ అధ్యక్షుడిగా పీ రత్నాకర్‌రావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఏ వెంకటనారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్‌గా పీ సదానందం, అడిషనల్ సెక్రటరీ జనరల్‌గా కే అంజయ్య ఎన్నికయ్యారు. టీఎస్‌పీఈఏ తరఫున టీఎస్‌ట్రాన్స్‌కో ఉపాధ్యక్షుడిగా బీ భాస్కర్‌రావు, సెక్రటరీగా కే వెంకటేశ్వర్, టీఎస్జెన్కో ఉపాధ్యక్షుడిగా పీ వెంకటేశ్వర్రావు, సెక్రటరీగా ఎన్ సురేశ్‌కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఉపాధ్యక్షుడిగా బీ శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీగా జేఎల్ జనప్రియ, టీఎస్ఎన్పీడీసీఎల్ ఉపాధ్యక్షుడిగా వైరాంబాబు, సెక్రటరీగా బీ సమ్యానాయక్ ఎన్నికయ్యారు.