హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 20: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కందాళ పాపిరెడ్డి, సీహెచ్ లయన్ రాంచందర్, కే అనంతరెడ్డి తెలిపారు.
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే అనిల్‌కుమార్ మాట్లాడుతూ… బడ్జెట్ పాఠశాలలను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. బడ్జెట్ పాఠశాలలను చిన్న పరిశ్రమల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు.