హుజూరాబాద్‌లో 61 మంది నామినేషన్లు

మొత్తం 92 సెట్లు దాఖలు
కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల మొదటి ఘట్టం ముగిసింది. స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం వెల్లువలా నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులు, ముఖ్యనాయకులతో వచ్చి రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డికి నామినేషన్లు అందజేశారు. ఈ నెల ఒకటిన విడుదలైన నోటిఫికేషన్‌తో నామినేషన్ల ఘట్టం మొదలైంది. 8 రోజుల్లో మొత్తం 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొదటి రోజు 2, చివరి రోజున మంత్రి హరీశ్‌రావుతో కలిసి వచ్చి మరో 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ 4, ఆయన సతీమణి జమున 4 సెట్లు వేయగా కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నర్సింహారావు 3 సెట్లు దాఖలు చేశారు. చిన్న పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న అభ్యర్థుల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

