హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఓటర్ల నమోదుకు ఆకర్షణీయమైన, స్ఫూర్తిదాయకంగా ఉండేలా పోస్టర్లు, వీడియోలు రూపొందించిన విజేతలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటించారు. ఎన్నికల సంఘం, హైసియా, కోడ్ తంత్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఎలక్షన్ క్రి-థాన్ 2023’ పోటీలో 1100 మంది పాల్గొన్నారు.
ఇందులో విజేతలుగా పీ వరుణ్ సాయి, వెంకటేశ్ మంతెన, రాహుల్ నాయక్, పీ హరీశ్, ఎంఏ జావేద్ నిలిచారు. వీరికి రూ.20 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. రన్నర్స్-కప్ప సుగుణ ఐశ్వర్య, అంకం శ్రీకాంత్, వీవీ కుసుమ్ ప్రియ, మహ్మద్ సాబీర్ ఎంపిక కాగా, వీరికి వీరికి రూ.10,009 చొప్పున ఇవ్వనున్నారు.