నకిరేకల్, అక్టోబర్ 9 : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కోడ్ నేపథ్యంలో బతుకమ్మ చీరలను పార్టీ దిమ్మెలకు కట్టి మహిళలను అవమానించారు. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చోటుచేసుకున్నది. నకిరేకల్ మండలం మంగళపల్లిలో పార్టీ దిమ్మెలకు, స్తూపాలకు, రాజకీయ, జాతీయ నాయకుల విగ్రహాలకు బతుకమ్మ చీరలను కట్టారు.
సర్కార్ పంపిణీ చేసిన చీరలను ఇలా దిమ్మెలకు, స్తూపాలకు కట్టడం వెనుక ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి ఎంపీడీవో సుధాకర్‌ను వివరణ కోరగా ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రజితతో మాట్లాడినట్టు తెలపారు. అవి బతుకమ్మ చీరలు కావని చెప్పారని, అయినప్పటికీ కలెక్టర్‌కు నివేదిక పంపినట్టు ఆయన పేర్కొన్నారు.