ఆక్సిజన్ సిలిండర్‌తో ప్రజావాణికి.. నా భూమి నా పేరుమీదికి మార్పించి న్యాయం చేయండి
‘నా భూమిని ఆన్లైన్ నుంచి అన్యాయంగా తొలగించిన్రు. ఆ భూమిని నా పేరిట తిరిగి రికార్డుల్లోకి ఎక్కించి పాస్ బుక్కు ఇప్పించాలి’ అని ఓ వృద్ధుడు వేడుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆక్సిజన్ సిలిండర్‌తో సోమవారం ఆయన కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
- ఆన్లైన్లో అన్యాయంగా తొలగించి ఇబ్బంది పెడుతున్నరు
- భూమిని కాజేసేందుకు కొందరి కుట్ర .. చర్యలు తీసుకోండి
- రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌కు వచ్చి ఓ వృద్ధుడి ఫిర్యాదు
- 8 ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 24 : ‘నా భూమిని ఆన్లైన్ నుంచి అన్యాయంగా తొలగించిన్రు. ఆ భూమిని నా పేరిట తిరిగి రికార్డుల్లోకి ఎక్కించి పాస్ బుక్కు ఇప్పించాలి’ అని ఓ వృద్ధుడు వేడుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆక్సిజన్ సిలిండర్‌తో సోమవారం ఆయన కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన కాసర్ల బాల్‌రెడ్డి, దేవారెడ్డి, వెంకట్‌రెడ్డి, హనుమంతరెడ్డి నలుగురు అన్నదమ్ము ళ్లు. ఇందులో దేవారెడ్డికి ఒక కొడుకు తిరుపతిరెడ్డి, ఇద్దరు కూతుళ్లు. కొడుకు 40 ఏండ్ల కిందటే చనిపోయాడు. బిడ్డల వివాహాలు జరిపించాడు.
అయితే 30 ఏండ్ల కిందట తన అ న్న బాల్రెడ్డికి చెందిన సర్వేనంబర్ 391లోని ఎకరం 12 గుంటలు, సర్వే నంబర్ 394లో 33 గుంటలు మొత్తం 2 ఎకరాల 5 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ సమయంలో దేవారెడ్డి ఉపాధి నిమిత్తం కొన్నేండ్లపాటు గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 2008లో అధికారులకు దరఖాస్తు చేసుకుంటే సదరు భూమి.. దేవారెడ్డి పేరిట పహాణిలో, ఆన్లైన్లో ఎక్కింది. 2017లో అతడి సోదరుడు కాసర్ల బాల్‌రెడ్డి ఆన్లైన్లో దేవారెడ్డి పేరు తొలగించి అక్రమంగా మళ్లీ తన పేరిట మార్చుకున్నట్టు బాధితుడు ఆరోపించాడు. ఈ వివాదంపై తాను కోర్టును ఆశ్రయిస్తే ఇన్‌జంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని దేవారెడ్డి తెలిపాడు. ఆరేండ్ల కిందట తాను తీవ్ర అనారోగ్యం బారినపడగా, అప్పటినుంచి ఆక్సిజన్ సిలిండర్ లేనిదే బతుకలేకపోతున్నట్టు చెప్పాడు.

తన అనారోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకొని భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. 2018 నుంచి జిల్లా అధికారులకు అనేకసార్లు దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ‘వయస్సు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నేను బయట తిరగలేని స్థితిలో ఉన్నా. మరణానంతరం నా భూమిని ఇతరులు ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నది. అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి పహాణీలు, కోర్టు ఉత్తర్వులు, ఇతర ఆధారాలను పరిశీలించి నా భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలి’ అని దేవారెడ్డి సోమవారం కలెక్టరేట్లో గరిమా అగర్వాల్‌ను కలిసి వేడుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

