రానున్న 10 రోజుల్లో పెరుగనున్న ఎండలు
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం పెరుగుతున్నది. రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ వెల్లడించారు. రానున్న 10 రోజుల్లో ఎండలు పెరుగనున్నాయని, ఉక్కపోత అధికమవుతుందని చెప్పారు.
- రాష్ట్రంలో విస్తరిస్తున్న ఎల్ నినో
- వాతావరణ నిపుణుడు బాలాజీ
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం పెరుగుతున్నది. రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ వెల్లడించారు. రానున్న 10 రోజుల్లో ఎండలు పెరుగనున్నాయని, ఉక్కపోత అధికమవుతుందని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నదని తెలిపారు. రాష్ట్ర సగటు వర్షపాత లోటు 20 శాతానికి పైగా, హైదరాబాద్‌లో మైనస్ 25 శాతానికి చేరే అవకాశమున్నదని బాలాజీ వెల్లడించారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

