హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): చెరువులు, కాలువల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తున్నదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సాగునీటి సంఘాలను ఏర్పా టు చేసే దిశగా సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. నీటిపారుదలశాఖ ఉ న్నతాధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వరదల నేపథ్యంలో దెబ్బతిన్న చెరువులు, కుంటలపై, కర్ణాటక చేపట్టిన ఆల్మట్టి ఎత్తు పెంపు, సీతారామ, సీతమ్మసాగర్ అనుమతులు, ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై చర్చించారు. ఆల్మట్టి ఎత్తుపెంపుపై సుప్రీంకోర్టులో పోరాటానికి సిద్ధం కావాలని, అంబేదర్ చేవెళ్ల-ప్రాణహిత డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సాగునీటి సంఘాల బలోపేతం ఆవశ్యకతను వివరిస్తూ రూపొందించిన అంశాలను మంత్రికి అందజేసింది. చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజీ-6కు సవరించిన అంచనాలకు త్వరలో మంత్రివర్గ ఆమోదం తీసుకుంటామన్నారు.
గ్రామ కార్యదర్శులకు రూ.104 కోట్లు విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శుల బి ల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. కార్యదర్శులు సమర్పించిన టోకెన్ నంబర్లకు సంబంధించిన మొత్తాన్ని సోమవారం విడుదల చేసినట్టు అధికారవర్గాల వెల్లడించాయి. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు క్లియ ర్ చేయాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు ఆర్థికశాఖ మంత్రి భట్టి నిధుల విడుదలకు ఆదేశించారని తెలిపా యి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన నాటి నుంచి 19 నెలలుగా రూ.383 కోట్లు ఖర్చుపెట్టామని పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ నేతలు చెప్తున్నా రు. రూ.104 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మరో 200 కోట్ల వరకు రావా ల్సి ఉన్నట్టు నేతలు తెలిపారు.