హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : బీసీ కులాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీని కోసమే కుల గణన చేస్తున్నామని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం లో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ప్రభాకర్ సమాధానమిచ్చారు. బీసీ సంక్షేమానికి, కేటాయించిన నిధుల్లో రూ.2వేల కోట్లు విడుదల చేశారని, వాటి లో రూ.800 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.
శాసనమండలిలో సోమవా రం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్య సభలో నవ్వులు పూయించింది. ‘రాష్రంలో 54 ఇంటిగ్రేటెడ్లలో 4 చొప్పున 116 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం అనడంతో తక్కెళ్లపల్లి రవీందర్ స్పందిస్తూ.. 116 కాదు.. 216 అవుతా యి. దీంతో ‘నేను లెక్కల్లో వీక్.. మీరు చెప్పిందే కరెక్ట్’ అంటూ మంత్రి సమాధానాన్ని కొనసాగించారు.