ఈసెట్, ఎంసెట్ పరీక్షలపై వర్ష ప్రభావం
- షెడ్యూల్ ప్రకారం నిర్వహణ లేక వాయిదా?
- నేడు ఉన్నత విద్యామండలి వెల్లడించే అవకాశం
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈసెట్, ఎంసెట్ పరీక్షలపై వర్షాల ప్రభావం పడనున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న ఈసెట్, 14 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి అధికారులు పునరాలోచనలో పడ్డారు. పరీక్షలను యథాతథంగా నిర్వహించడమా.. లేక వాయిదావేయడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఆదివారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి టీసీఎస్ అధికారులతో సమీక్షించారు. వరదలు పొంగి రోడ్లు తెగిపోయి, సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభిస్తేనే పరీక్షల నిర్వహణకు ఆటంకం కలుగుతున్నదని టీసీఎస్ వర్గాలు పేర్కొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ముసురే కురుస్తుండటంతో పరీక్షలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని అభిప్రాయపడినట్టు సమాచారం. మొత్తం మీద సోమవారం నాటి వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని ఓ ఉన్నతాధికాకారి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ESET
- MSET exams
- rain
RELATED ARTICLES
తాజా వార్తలు
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
7వేల మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

