కాజీపేట : సీఎం కేసీఆర్ నేతృతంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కుల బంధువులు అండగా నిలువాలని పద్మశాలీ సంఘం జాతీయ నాయకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఈగ మల్లేశం అన్నారు. బుధవారం కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో కాజీపేట మండల పద్మశాలీ కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సమైక్య పాలకులు కులవృత్తులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ఏర్పాటు అయినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కులవృత్తులలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కుల బంధువులు రాజకీయంగా ఎదగాలని సూచించారు. అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కాజీపేట పట్టణంలో పద్మశాలీ కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నగరంలోని కుల బంధువులందరూ తమ అమూల్యమైన ఓటును ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్ వేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సారంగపాణి, దేవులపల్లి సదానందం, తోట యాదగిరి, రాజేష్, ఆనంద్, జగదీష్, అగ్ర రాజు, పున్నమి చందర్, సతీష్ తదితరుల పాటుగా కుల బంధువులు పాల్గొన్నారు.