హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : టెట్ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులు సవరించుకునే అవకాశాన్ని విద్యాశాఖ అధికారులు కల్పించినట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణ గడువు గురువారంతో ముగియనుంది. మంగళవారం వరకు పేపర్-1కు 22,513, పేపర్-2కు 60,940, రెండు పేపర్లకు 96,189 దరఖాస్తులు వచ్చాయి.