హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): టీజీ ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కాలేజీల్లో, పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 31 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శనివారం హైదరాబాద్‌లో టీజీ సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదలచేశారు. ఎడ్‌సెట్‌కు ఆగస్టు 8 నుంచి 20 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 22, 23న వెబ్ ఆప్షన్స్, 24న ఎడిట్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించారు.
30న ఫస్ట్‌ఫేజ్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 31 నుంచి సెప్టెంబర్ 4వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పీఈసెట్‌కు ఆగస్టు 7 నుంచి 14వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. 16, 17న వెబ్ ఆప్షన్స్, 18న ఎడిట్‌కు అవకాశం కల్పించారు. 20న ఫస్ట్‌ఫేజ్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 21 నుంచి 24వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వివరాలకు http://edcetadm.tsche.ac.in, http://pecetadm. tsche.ac.in వెబ్సైట్లను చూడాలని సూచించారు.
అక్రమ కేసులు దుర్మార్గపు చర్య : ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధుల తగ్గింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు సందీప్, కార్యదర్శి ధర్మభిక్షంపై అక్రమకేసులు బనాయించడం దుర్మార్గపు చర్య అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో వారు మాట్లాడుతూ.. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎస్ఐపై ఒత్తిడి పెంచి ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.