హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వచ్చే నెల 20న విడుదల కానున్నది. ఈ క్రమంలో ఎడ్‌సెట్ కమిటీ సమావేశాన్ని బుధవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు.
విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ వెంకట్రామ్రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 23 నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.