హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): హీరా గోల్డ్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మరోసారి సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌తోపాటు, తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి ఐదు చోట్ల తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు చేపట్టింది.
హీరా గ్రూప్ అధిపతి నౌహీరా షేక్‌తోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల ఇండ్లు, కార్యాలయాల్లో జరిగిన ఈ సోదాల్లో ఈడీ అధికారులు రూ.90 లక్షల నగదుతోపాటు రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
వివిధ స్కీమ్‌ల పేరుతో వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి ఎంతో మందిని మోసగించారన్న ఆరోపణలతో నౌహీరా షేక్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కిపైగా కేసులు నమోదయ్యాయి.