Enforcement Directorate | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అవినీతి లేదు. అక్రమం జరుగనే లేదు. నిధుల దుర్వినియోగం అసలే లేదు. ఐతేనేమి.. ఫా ర్ములా ఈ-కారు రేసులో ఏదో జరిగిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఆ వెంటనే మరో పనిలేనట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగిం ది. ఏసీబీ కేసు నమోదై 24 గంటలు గడువకముందే ఆగమేఘాలపై వాలిపోయిన ఈడీ అధికారులు.. శుక్రవా రం రాత్రి ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశా రు. మాజీ మంత్రి కేటీఆర్, నాటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
ఏసీబీ ఎఫ్ఐఆర్ను ఫాలో అవుతూ..
ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్లోనే ఎన్నో అర్థంకాని ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని ఈడీ మరో కేసు ఎలా నమో దు చేసిందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా-ఈ రేసు ని ర్వహించింది. అందుకు రూ.55 కోట్ల ను హైదరాబాద్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతా నుంచి బ్రిటన్లో ని ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్ఈవో) సంస్థ బ్యాంకు ఖాతాకు పంపారు. ఈ నగదు ముట్టినట్టు రేసు నిర్వహణను పర్యవేక్షించిన ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సీఐ) కూడా వెల్లడించింది. విధానపరమైన లోపాలు జరిగా యే గానీ, అవినీతి జరుగలేదని కేటీఆ ర్ చెప్పారు. బ్యాంకు ఖాతా నుంచి మ రో ఖాతాకు నగదు లావాదేవీ జరిగిం ది. ఒక్కరూ పాయీ పక్కదారి పట్టలే దు. అవినీతి ఎక్కడున్నదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇవే మీ పట్టించుకోని ఏసీబీ.. గురువారం ఎఫ్ఐఆర్ నమో దు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చే యడం కుట్రేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.