హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఇన్వాయిస్ డిసౌంటింగ్ పేరిట దాదాపు 6,979 మందిని మోసగించిన ఫాలన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఈడీ శనివారం కేసు నమోదు చేసింది. డిపాజిటర్లకు అధిక లాభాలను ఆశచూపి రూ.1,700 కోట్లు వసూలు చేసిన ‘ఫాలన్’ నిర్వాహకులు అందులో రూ.850 కోట్లను విదేశాల్లోని 22 డొల్ల కంపెనీలకు మళ్లించినట్టు ఇప్పటికే సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం తేల్చింది. 19 మందిపై కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులైన ముగ్గురు దుబాయ్‌కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించడంతో వారు వినియోగించిన 25 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.