హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్.. వివిధ పార్టీలకు ఇచ్చిన ప్రచార వీడియో ప్రకటనల అనుమతులను రద్దుచేసింది. కాంగ్రెస్ పార్టీ 6 వీడియోలు, బీజేపీ 5 వీడియోలు, బీఆర్ఎస్ 4 వీడియోలను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) cనిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని పేర్కొన్నది.
దీంతో ఈ ప్రకటనల అనుమతిని రద్దు చేస్తున్నట్టు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ఈ ప్రకటనలను ఆయా చానెళ్లు వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై అభ్యంతరకరంగా ప్రకటనలు రూపొదించారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రకటనలు మరోసారి పరిశీలించిన ఎన్నికల సంఘం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నది.