పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లతో పాటు విద్యాసంస్థలు నీటమునిగాయి.
లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఆయా చోట్ల ఇండ్ల నుంచి బయటకు రాలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోటెత్తడంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు రాలేక అల్లాడిపోయారు. ప్రభుత్వం నుంచి సాయం కోసం అంతా ఎదురు చూశారు.
రాయికల్, ఆగస్టు 28: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణినిఎక్స్కవేటర్ సాయంతో అవతలి ఒడ్డుకు చేర్చారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ పరిధిలోని మాంగ్త్యానాయక్ తండాకు చెందిన గుగ్లావత్ కళ్యాణికి గురువారం సాయంత్రం పురిటినొప్పులు ఎకువ కావడంతో కుటుంబ సభ్యు లు ఆమెను తీసుకొని జగిత్యాలకు బయలుదేరారు.
మార్గమధ్యలో భూపతిపూర్-రామాజీపేట గ్రామాల మధ్య వంతెనపై నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో అవతలి వైపే ఆగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న రామాజీపేట గ్రామానికి చెందిన యువకులు ఎక్స్కవేటర్ సాయంతో గర్భిణిని అవతలి ఒడ్డుకు చేర్చారు. అకడి నుంచి అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లిలో ఎస్టీ గురుకుల పాఠశాలలో చిక్కుకున్న విద్యార్థులను తరలిస్తున్న సహాయ బృందాలు
జిల్లాలోని పస్రా-తాడ్వాయి మధ్యలోని మండల తోగు వద్ద కోతకు గురైన 163 జాతీయ రహదారి
ములుగు కామారెడ్డి హౌసింగ్‌బోర్డు వద్ద కొట్టుకుపోయిన లారీ
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్‌లోకి చేరిన వరదతో చనిపోయిన కోళ్లను చూపిస్తున్న యజమాని
కామారెడ్డి హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద కోతకు గురైన పాత హైదరాబాద్ రహదారి
సిద్దిపేట జిల్లాలో నీట మునిగిన కాలనీ
మెదక్ జిల్లా హవేళీఘన్‌పూర్ మండలం రాజ్‌పేట్‌తండా వద్ద పొలంలో దొరికిన సత్యనారాయణ మృతదేహం