హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంజినీరిం గ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు తొలి వి డత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈనెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయనున్నట్టు పేర్కొన్నది.
25 నుంచి జూలై 1వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 4 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు 5నుంచి 7వరకు అవకాశం కల్పించినట్టు వెల్లడించింది. 10లోగా సీట్ల అలాట్మెంట్ ప్రొవిజనల్ జాబితాను విడుదల చేస్తామని వివరించింది. 10నుంచి 14వరకు వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు https://tgeapcet.nic.in వెబ్సైట్ను సందర్శించాలని కోరింది.