నీలగిరి, జూన్ 2: ప్రభుత్వాలు, వివిధ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు ‘ఈ-క్లాసెస్’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది నిరుద్యోగులకు వరం లాంటిదని, ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ యువనేత ఏనుగు రాకేశ్‌రెడ్డి రూపొందించిన ఈ-క్లాసెస్ యాప్‌ను మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్‌లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాప్‌ను రూపొందించిన రాకేశ్‌రెడ్డిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే ఆగ్రగామిగా నిలిపితే, రేవంత్‌రెడ్డి సర్కార్ దానిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిందని విమర్శించా రు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున యాప్రె ఆవిషరించడం సంతోషంగా ఉన్నదన్నారు.