హైదరాబాద్, జులై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్స్ జారీ చేయాలని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జులై 4న నిర్వహించే ‘చలో సెక్రటేరియట్’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి అనగంటి వెంకటేశ్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.