హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న సింగపూర్‌లోని నాన్యాంగ్ ఆడిటోరియంలో దసరా కల్చరల్ నైట్-2023 ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. టికెట్ల ధరలు, బుకింగ్ కోసం సింగపూర్ తెలుగు సంఘం, బుక్ మై షో వెబ్సైట్లను సంప్రదించవచ్చని, ఒకటికన్నా ఎక్కువ టికెట్లు బుక్ చేసుకున్నవారికి డిస్కౌంట్లు ఇస్తున్నట్టు చెప్పారు. స్పాన్సర్షిప్, ప్రకటనలు, స్టాల్స్ ఏర్పాటుకు +65 82335323, +65 83323427ను సంప్రదించాలని కోరారు.