హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చలిగాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతున్నాయి. సాయంత్రం నుంచే మొదలైన చలి వాతావరణం మరునాటి ఉదయం వేళల్లో జనాలకు వణుకు పుట్టిస్తున్నది. ఉదయం దట్టమైన పొగమంచు కప్పేయడంతో రహదారులు కనిపించడమే లేదు
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ 28.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.1 డిగ్రీలుగా నమోదవగా, గాలిలో తేమ 34 శాతంగా ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో గ్రేటర్‌కు అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.