నకిరేకల్ అక్టోబర్ 1 : నకిరేకల్‌లోని విజయదుర్గ రైస్ మిల్లులో ఉన్నవి రేషన్ బియ్యం కావని పౌరసరఫరాల శాఖ డిటిఆర్ జ్యోతి తెలిపారు. నకిరేకల్ రేషన్ బియ్యం ఉన్నాయని సమాచారంతో మిల్లుకు వెళ్లామని, శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపామన్నారు. ల్యాబ్ రిపోర్టులో అవి దొడ్డిబియంగా నిర్ధారణ అయిందని అయితే అవి రేషన్ బియ్యం కాదని బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
గత సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి దొడ్డు వడ్లు కొన్నారని, ఆ వడ్లను పట్టి బియ్యం నిల్వ చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. మిల్లు నిర్వాహకులు తాళం వేసిన సమయంలో నల్గొండలోని సివిల్ సప్లై కార్యాలయంలో మిల్లుకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు వెళ్లారని తెలిపారు. శాంపిల్స్ సేకరించిన బియ్యం తాలూకా 70 బస్తాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఆ స్టాక్ రైస్ మిల్లులోనే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.