బంజారాహిల్స్, జనవరి 27 : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్రెడ్డి, అతని స్నేహితుడు కొత్త బాబును 2 రోజుల పోలీస్ కస్టడీకి 17వ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నిందితులను శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు.
రిమాండ్లో ఉన్న నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేయగా, శుక్ర, శనివారాల్లో విచారించాలని కోర్టు అనుమతి ఇచ్చింది.