మిర్చి క్వింటాలుకు @ 26,700.. యూఎస్-341 రకానికి రికార్డు ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గురువారం యూఎస్-341 రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. గత నాలుగు సంవత్సరాల సీజన్లో అత్యధికంగా క్వింటాలు రూ.26,700 పలికినట్లు అధికారులు తెలిపారు.
కాశీబుగ్గ, ఫిబ్రవరి 5 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో గురువారం యూఎస్-341 రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. గత నాలుగు సంవత్సరాల సీజన్లో అత్యధికంగా క్వింటాలు రూ.26,700 పలికినట్లు అధికారులు తెలిపారు. నిరుడు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ధర పలుకగా బుధవారం పెద్ద మొత్తంలో ధరలు పలికినట్గు అధికారులు తెలిపారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సింగారం గ్రామానికి చెందిన సాంబయ్య 54 బస్తాల మిర్చి తీసుకురాగా.. సత్యనారాయణ బజాజ్ ట్రేడర్స్ అడ్తి ద్వారా శ్రీ గణేశ్ స్పైసెస్ ఖరీదు వ్యాపారి కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 10వేల క్వింటాళ్లు (20వేల బస్తాలు) రాగా గురువారం మార్కెట్కు 2500 బస్తాలు వచ్చాయి. క్వింటాలుకు అత్యధికంగా రూ.26,700, మధ్యరకానికి రూ.24,500, కనిష్ఠంగా రూ.12,500 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. వండర్ హాట్ మిర్చికి ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో క్వింటాలు రూ.38వేల ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

