హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించేందుకు ఏడీస్టీవ్ ఫౌండేషన్ అండ్ క్రియేట్ ఎడ్యుటెక్తో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో జతకట్టింది. క్రియేట్ ఎడ్యుటెక్లో భాగంగా ‘డ్రగ్ ఫ్రీ వెల్నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నట్టు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. చురుకైన విద్య, అవగాహన ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిషరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా క్రియే ట్ ఎడ్యుటెక్ ప్రతినిధులు కొండూరు సంస్కృ తి, చాడ శ్రీహర్షితను అభినందించారు. డ్రగ్స్ రహిత తెలంగాణను రూపొందించేందుకు ఈ ఒప్పందం మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 14ఏండ్ల కొండూరు సంస్కృతి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.. కాగా, ఆమె ఎస్ఐబీ ఐజీ సుమతి కూతురు కావడం విశేషం.