హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో అన్నదాతల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. కరెంట్ రాక, నీళ్లు లేక, ఎరువులు, విత్తనాలు సరిపడా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేక కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కాగా, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో(Palakurti Constituency) ఎన్నడు లేనంతగా కరువు పరిస్థితులు(Drought conditions) నెలకొన్నాయి. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో నీళ్లు లేక వంద ఎకరాల్లో పంట ఎండిపోయింది.
వర్షకాలం మొదలైనా ఇంతవరకు నియోజకవర్గంలోని ఎస్సారెస్పీ(SRSP) కాలువలోకి నీళ్లు రాలేదు. ఇటు వర్షాలు లేక అటు కాలువుల ద్వారా నీళ్లు అందక రైతులు కష్టాలు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కనీసం ఇటు వైపు చూసే ప్రయత్నం చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పిటికైనా ప్రభుత్వం స్పందించి సాగురు నీరు అదించాలని రైతులు కోరుతున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నడు లేనంత కరువు
నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలు
వర్షకాలం మొదలైనా ఇంత వరకు నియోజకవర్గంలో SRSP కాలువలో నీళ్లు రాలేదు.
ఇంతవరకు కనీసం SRSP కాలువను పరిశీలించని స్థానిక ఎమ్మెల్యే.
పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో SRSP కాలువలో నీళ్లు లేక ఎండిన 100… pic.twitter.com/jfgFAs7PAO
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2024