భువనగిరి అర్బన్, జనవరి 3 : భువనగిరి ప్రభుత్వ ఏరియా దవాఖాన నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌కు అధునాతన పద్ధతిలో మెడిసిన్‌ను తరలించేందుకు విమానం ఆకారంలో డ్రోన్ తయారు చేసి ట్రయల్ నిర్వహించారు. ఇందులో భాగంగా భువనగిరిలో బుధవారంతో మూడు సార్లు ట్రయల్ రన్ విజయవంతం చేశారు. భువనగిరి ఏరియా దవాఖాన నుంచి మందులను ఐదు నిమిషాల్లోనే బీబీనగర్ ఎయిమ్స్‌కు తరలించారు. ఇది 25 కిలోల బరువును 30 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుందని డ్రోన్ నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభిస్తారని వారు పేర్కొన్నారు.