Driving License | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలకు, అడ్డదారిలో లైసెన్సులు పొందేవారికి చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఆధునీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షను తొలగించి, మరింత ప్రామాణికమైన ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్ట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇకపై లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆటోమెటిక్ డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. రహదారులపై నిత్యం ఎదురయ్యే సమస్యలను కొత్త పద్ధతిలో టెస్ట్ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనం నడిపినప్పుడు కంప్యూటర్లో రికార్డు అవుతుంది. దీంతో సక్రమంగా వాహనం నడిపినవారికే లైసెన్సు లభిస్తుంది. డ్రైవింగ్‌లో ఏ చిన్న తప్పు చేసినా పరీక్షలో ఫెయిల్ అయినట్టే.