హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): డ్రైవర్, మెకానిక్ పోలీస్ ఉద్యోగార్థులకు మార్చి 2వ తేదీ నుంచి డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ టెస్ట్‌ను నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ఆర్బీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫిజికల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు బోర్డు వెబ్సైట్లో అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ పరీక్షలు మార్చి 2 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని ఎస్ఏఆర్ సీపీఎల్ అంబర్పేట్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నది.
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సందేహాలుంటే support@tslprb.inకు మెయిల్, 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని సూచించింది. పరీక్ష పూర్తయ్యే వరకు అడ్మిట్‌కార్డును భద్రపరచాలని, ప్రతీ అభ్యర్థి స్వీయ ధ్రువీకరణ ఫొటో కాపీలతో పాటు దానికి జత చేయాలని పేర్కొన్నది. వీటితో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు, జిరాక్స్‌లు వెంట తీసుకెళ్లాలని చెప్పింది.