హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా అందివ్వనున్న డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సామాజిక న్యాయ పురస్కారానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ ఉద్యమకారుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఎంపికయ్యారు. ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
లోహియా జయంతిని పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఈ అవార్డును అందిస్తున్నట్టు తెలిపారు. సామాజిక న్యాయం, బీసీ హకుల సాధన కోసం వకుళాభరణం చేస్తున్న కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 23న ఢిల్లీలోని రాజా రామ్మోహన్రాయ్ మెమోరియల్ హాల్లో ప్రశంసాపత్రంతోపాటు రూ.1.15 లక్షల నగదు పురస్కారం, జ్ఞాపిక అందించనున్నట్టు వివరించారు.