హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): టీజీ ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు వందలోపు 50 ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. 4, 5, 7, 8, 12 వంటి అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో వందలోపు 34 ర్యాంకులు, అగ్రి, ఫార్మసీ విభాగంలో వందలోపు 16 ర్యాంకులు సాధించినట్టు వివరించారు. మొత్తం పదిలోపు 4, వందలోపు 50, 500లోపు 234, వెయ్యిలోపు 454 ర్యాంకులు సాధించారని తెలిపారు. 45 సంవత్సరాలుగా విశిష్ట ప్రణాళిక ద్వారా ఇంతటి ఘన విజయాలు సాధిస్తున్నామని వెల్లడించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ అభినందనలు తెలిపారు.