ఖైరతాబాద్, జూలై 6 : మున్నూరుకాపు నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 24 శాతం ఉన్న మున్నూరుకాపులకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మున్నూరుకాపు కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు, కోకాపేటలో ఆత్మగౌరవ భవానికి రూ.20 కోట్లు, మున్నూరుకాపు బాలబాలికలకు ప్రతి జిల్లా కేంద్రంలో రెండెకరాల భూమి, భవన నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలోనే సీఎం, డిప్యూటీ సీఎం మల్లు, మంత్రులు పొన్నం, దుద్దిళ్ల, సీతక్కకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకోటి రాజు, కార్యదర్శి వాసాల వెంకన్న, గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు దేశెట్టి శివ పాల్గొన్నారు.