హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఎంవోఏ టీజీవో అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జే రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జే పృథ్వీరాజ్ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు.
కోశాధికారిగా డాక్టర్ బీఎస్కే ధర్మరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ వై శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ కిరణ్‌కుమార్ గుప్తా ఎన్నికయ్యారు. అనంతరం వీరందరికి నాంపల్లిలోని గెజిటెడ్ భవన్లో టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వీ మమత, ప్రధానకార్యదర్శి ఏ సత్యనారాయణలు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు ఎంబీ కృష్ణాయాదవ్, రవీందర్‌కుమార్, లావణ్య, లక్ష్మణ్‌గౌడ్, నర్మదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.