హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ డిగ్రీ కాలేజీ టీచర్స్ అసోసియేషన్(టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బీ శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఈ బ్రిజేశ్ ఎన్నికయ్యారు. ఉస్మానియా ఫ్యాకల్టీ క్లబ్లో జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్, బ్రిజేశ్ ప్యానల్ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. అసోసియేషన్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ సౌందర్య జోసఫ్, మహిళా కార్యదర్శిగా ఎం భవాని, అకాడమిక్ కార్యదర్శిగా గోపాల సుదర్శన్, ఆర్థిక కార్యదర్శిగా గంగాధర్, ఉపాధ్యక్షులుగా ఆడెపు రమేశ్, జీఎన్ జగన్, కార్యదర్శులుగా ఎస్ హరీశ్‌కుమార్, ఎం రామాచారి, యూనివర్సిటీ కార్యదర్శులుగా రాకేశ్భవాని, డీ సమ్మయ్య, యాదయ్య, పీ రాములు, రాజేశ్ ఎన్నికయ్యారు. పూర్వ అధ్యక్షులు సంగి రమేశ్, విజయ్‌కుమార్ గెలుపొందిన వారిని అభినందించారు.