హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): డీపీహెచ్ కార్యాలయ సూపరింటెండెంట్ సలావుద్దీన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. మంగళవారం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీపీహెచ్) రవీంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన ఓ స్టాఫ్ నర్స్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైనట్టు పేర్కొన్నారు.
దీనిపై ఐసీసీ కమిటీ విచారణ జరిపి, నిందితుడిని సస్పెండ్ చేయాలని నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు సలావుద్దీన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.