హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమశాఖ ఇన్చార్జి అదనపు కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. గతంలో కమిషనర్గా ఉన్న శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో తాత్కాలికంగా బాధ్యతలను డీపీహెచ్కు అప్పగిస్తూ వైద్యారోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.