హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీలలో సీట్ల భర్తీకి దోస్త్-2024 స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నేటి(గురువారం) నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో దోస్త్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 2 వరకు స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందని, రూ.400 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. 27 నుంచి ఆగస్టు 3 వరకు స్పెషల్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల నమోదు, 6న సీట్ల కేటాయింపు, 7 నుంచి 9 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు విధించారు. ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ చేసిన వారు 7 నుంచి 9 వరకు నేరుగా కాలేజీలలో రిపోర్టు చేయాలని అధికారులు తెలిపారు. వివరాలకు దోస్త్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
దోస్త్ ద్వారా నిథమ్‌లో బీబీఏ అడ్మిషన్లు
హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్)లో బీబీఏ కోర్సు అడ్మిషన్లను ఈ ఏడాది నుంచి దోస్త్ ద్వారా చేపట్టనున్నారు. సంస్థ అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల ఆదేశాలను జారీ చేయగా, నిథమ్ చైర్పర్సన్ వాణిప్రసాద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించారు.