హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తాత్కాలిక ఆనందాల కోసం డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, క్షణికమైన ఒత్తిడి, సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని సూచించారు. జీవితం అన్నింటికంటే విలువైనదని, డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.